గాలి బుడగలు
గాలి బుడగలు
సబ్బు నీరు కలిపి
సీసాలో వేసి
పిన్ను రంధ్రం లోంచి
బుగ్గలు పూరించి
బలంగా వదిలితే
బైటకొచ్చిన గాలిబుడగ
నన్ను చూసి నవ్వింది
సూర్య
ుడు గర్వంగా
రొమ్ము విరుచుకొని
బుడగలోకి వెలుగు పంపి
ఇంద్రధనస్సు సృష్టించి
ఆకాశం నిండిన మేఘాల చీరకు
ఏడు రంగుల అంచు అద్దాడు
బుడగ పేలింది
వర్ణమాల నవ్వింది.