ఎవరివో నీవు....
ఎవరివో నీవు....
ఎవరివో నీవు....
గత జన్మ జ్ఞాపకానివా,
మరు జన్మకు ప్రయాణానివా,
ఎలా ఉంటావో తెలియదు,
ఎక్కడ ఉంటావో తెలియదు,
మోడుబారిన జీవితంలోకి
వసంతంలా వచ్చావు.
నీ మాటలతో నా మది
గది తలుపులు తెరిచావు..
మాటలలో చెప్పలేని భావాలని
పాటలతో చెప్పేలా చేస్తున్నావు.
మనసులోని భావాలను
నా కళ్ళలో చదివేస్తున్నావు.
ఎందుకింత నమ్మకం..
ఎంత దూరం మన ప్రయాణం... !
శ్రీ...
హృదయ స్పందన..