ఎప్పుడూ
ఎప్పుడూ
ముగించ కుదరని..లేఖను ఎపుడూ..!
మాటల ఇమడని..భాషను ఎపుడూ..!
మదినే ఇచ్చిన..సంగతి మరచితి..
పాటకు లొంగని..ఊటను ఎపుడూ..!
చీకటి మెఱుపుల..ఇంటికి అతిథిని..
వేకువ ఎరుగని..తారను ఎపుడూ..!
గుండెను తొలిచే..రాగం ఏదో..
ప్రేమకు నోచని..వీణను ఎపుడూ..!
ఎఱ్ఱని వెన్నెల..పూవుగ మనసే..
వలపే పండని..జాణను ఎపుడూ..!
విందుగ మిగిలిన..మౌనం తోడుగ..
ఎంతకు విరియని..మొగ్గను ఎపుడూ..!
