ఎంతవిన్నా
ఎంతవిన్నా
పండువెన్నెల్లో సన్నగా వీచే గాలి
వడగాడ్పు కన్నా వేడిగా వీస్తోంది
ఆకాశంలో అదే అందాల చందమామా
యుగాలుగా ఎందరిని వేధించిందో కదా
నింగి దాటి నేల పై పరచిన
వెండిజిలుగుల తివాచీ ఇసుక తెన్నెలపై
నిద్రపట్టని తీతువ పిట్టలేవొ అదాటుగా
వినిపించే కువ కువల సన్నాయి
ఆ పక్కనే ఉన్న పొదలలో
అప్పుడప్పుడు వింత వింత శబ్దాలు
అంతా అద్భుతంగానే ఉన్నా
నువ్వు చెంత లేవనే చింత మాత్రం
ఆకాశంలో నల్లటి మేఘమై కమ్మింది
ఏ నిమషంలో కురుస్తుందో తెలియని
దిగులు మేఘంలా మనసు ముసురు పట్టింది
మధురమైన విరహమేదో మనసు దాటి
నీ తలపుల జడివానలో తడిచిన నాకు
నిదురమ్మ కంటి దరికే రానంటోంది
మనసు పారేసుకున్నాకా
పున్నానికి అమా వాశ్యకి పెద్ద తేడా లేదంటూ
నీలాటి కనులలో కన్నీటి చుక్కలా మెరిసింది

