STORYMIRROR

Sita Rambabu Chennuri

Drama

4  

Sita Rambabu Chennuri

Drama

ఎన్ని కష్టాలో...

ఎన్ని కష్టాలో...

1 min
459


మిత్రుడడిగాడు కవిత రాయలేదేమని

అన్నింటా 'లేమి' చోటుచేసుకున్న వేళ 

కవితకూ 'లేమి' చుట్టుకుందని చెప్పలేకపోయాను


రైలెక్కుదామంటే స్థలము లేమి

ముసిరే చీకట్లలో వేలాడే జ్ఞాపకాల్లా

తోసుకుంటూ రాసుకుంటూ మనుషులు


ఉదయాన్నే యమభటుల్లా వేధించే వార్తలతో

మనసుకో తడిలేమి..తేమ ఎండిననేలలా

తాగే తేనీరులో ఎవరిదో కన్నీరు బావురుమంటోంది


బస్సెక్కుదామంటే ఆర్తనాదాల హోరులో హారన్

వినిపించలేదు

మంచు పేరుకున్నట్టు కారు అద్దాలపై మనుషుల మౌనం

పూశారెవరో


హేమంతం వెలుగుకిరీటాన్ని ధరించలేదెందుకో

జంక్ ఫుడ్ తిన్నట్టు సూర్యుడూ జంకుతున్నాడు 

ఆకలే ఉన్న లోకంలో కలల ప్రస్తావనెందుకుంటున్నాడేమో


కలల తిమ్మిరి దిగి చాలాకాలమైందికదా

కళ్ళద్దాల రంగుమాత్రం మారలేదు

పంచరంగుల ప్రపంచాన్ని చూద్దామనే ఆశమాత్రం చావలేదు

పాపం ఆశకిప్పుడు ఎన్ని కష్టాలో..


Rate this content
Log in

Similar telugu poem from Drama