STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఏనుగు మీద ఊరేగింపుగా..

ఏనుగు మీద ఊరేగింపుగా..

1 min
288

కవులని

గొప్ప భావుకులని

ఏనుగు మీద ఊరేగింపుగా

వారిద్దరినీ తిప్పారు


చుట్టూ జనం జేజేలు

రాజభటులు చూపిస్తున్న గౌరవం

ఇదంతా కలేనా 

అన్నట్టున్న వైభోగం


ఇంతకూ వాళ్ళు చెప్పిందేమిటి

కలో గంజో తాగైనా

సంతోషంగా ఉండమని

ఆడంబరాలు అక్కర్లేదని


నలుగురినీ సమానంగా చూడమని

వీలైన సాయం చేయమని 

అహంకారం కూడదని

నిజమైన నిన్ను

నువ్వుగా ఉంటూ తెలుసుకోమని

జన్మ రాహిత్యం పొందమని


ఇంత మోహం భోగాలపైన 

అస్సలే లేని ప్రజలకు

ఈ ఏనుగు మీద ఊరేగింపు

చెప్పేదేమిటి..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract