STORYMIRROR

Midhun babu

Romance Inspirational Others

4  

Midhun babu

Romance Inspirational Others

ఏమో ఏమయిందో

ఏమో ఏమయిందో

1 min
337

ఏమో ఏమయిందో....

అనుమానపు చీకటి ఆవరించి

ఆవగింజంత విచక్షణ కనుమరుగయ్యిందా

ఆది చినుకు ఆతృతేమైనా

నన్నుపూని తొందరపడేలా చేసిందా

భంగతపస్వి శాపమేదైనా

తగిలి బుద్ధి మందగించిందా

లేకపోతే....

నువు చేసిన నాట్యాన్నో..

నువు వేసిన నాటకాన్నో..

నువు ఆలపించిన గీతాన్నో..

వింటూనో....

చూస్తూనో....

మైమరిచి ఆస్వాదిస్తూనో...

చప్పట్లు గట్టిగా చరిచానేమో

మనల్ని కలిపే చేతిరేఖల వారధులు చెరిగాయేమో

విధాత రాసిన రాతలు మారాయేమో

అందుకేనేమో.....

నిన్ను దూరం చేసుకున్నానేమో

మదికి చిన్న గాయమే అనుకున్నానేమో

ఆ గాయమే ఇప్పుడు పుండులా మారిందేమో

అందుకేనేమో.....

నా మది....

లేపనంగా నీ చెలిమి కావాలంటోంది

కోలుకునేలా నీ కౌగిలి కావాలంటోంది

మరణించకుండానే మరల పుట్టేలా నీ ముద్దు కావాలంటోంది

ముందులా నడుచుకోనని హామీ ఇవ్వాలనుకుంటోంది

నిన్ను గాఢంగా ప్రేమించాలనుకుంటోంది

ఇక ఈ జీవితం నీకే అంకితం అంటోంది


Rate this content
Log in

Similar telugu poem from Romance