ఏమి కధనో
ఏమి కధనో
పట్ట పగలే లేదు మెలకువ.. అలా ఎందరొ ఏమి కథనో..!?
నిదురనైనా పోరు నిద్దుర..అలా ఎందరొ ఏమి కథనో..!?
కనులు తెరచీ కలలు కంటూ..కనే బాధలు చెప్ప తరమా..!?
నాటకమ్మున పాత్ర తెలియక..అలా ఎందరొ ఏమి కథనో..!?
రాయి రప్పా..చెట్టు చేమా..ఎదుగుతున్నవి ఎంత చక్కగ..!
మానవత్వం వెల్లివిరియక.. అలా ఎందరొ ఏమి కథనో..!?
మనసు మాయే తొలగు విధమది అందజాలక చూడు యాతన..!
కాల సంద్రపు అలల పరుగున.. అలా ఎందరొ ఏమి కథనో..!?
ఎవరి కర్మము వారిదే మరి..వీడు చింతన సాగు చుండును..!
ఆత్మ శక్తిని పెంచు టెరుగక.. అలా ఎందరొ ఏమి కథనో..!?
