ఏకమయ్యాం
ఏకమయ్యాం
చూపులు కలసిన
శుభవేళలో
మేమిద్దరం మానసికంగా
ఏకమయ్యాం
పదిమందిలో ఉన్నా
ప్రపంచాన్ని మరిచిపోయేవాళ్ళం
ఇద్దరిదీ మౌన రాగం
నిశ్శబ్దంగా పలకరించుకునేవాళ్ళం
అతని చిరునవ్వు
నాకు అతి మనోహరం
సిగ్గుతో నాకళ్ళు వాలితే
అతనికి బహు ముచ్చట
తండ్రి చాటు బిడ్డని
మా ఇంటికి ఎప్పుడు వచ్చి
మా పెళ్లి గురించి అడుగుతారా
అని వేయికళ్ళతో
ఎదురు చూస్తున్నా
