ఏకాకిగా ఉన్న తొలి రాతిరి
ఏకాకిగా ఉన్న తొలి రాతిరి


చిన్నతనంలో ఏకాకిగా ఉండటంలో కలిగెను భయం,
ఆ సమయమున కోరుకొనెను ఆంజనేయ దేవుని అభయం |౧|
అర్థరాత్రి వేళ నిర్మానుష్య రహదారిలో ప్రయాణం అనిపెంచెను భీతికరం,
ఎటుపక్కనుండైనా వచ్చెను దొంగ దెయ్యం అడవి మృగం వలన అపాయం |౨|
ఆడదానికి ఎప్పుడు లేదు రాత్రివేళ ఒంటరి పయనం,
అత్యవసర పరిస్థితిలో తోడు ఉంటేనే చెయ్యాలి రాతిరి ప్రయాణం |త్రీ|
ఏకాంతం అయిష్టం చేశేను నిర్జన అంతఃపురం,
నారికి ధ్వని ప్రతిధ్వనితో ఈ భవనం అనిపించెను భయంకరం |౪|
కార్యాలయంనుండి రాత్రివేళ ఒంటరిగా రావటం అనవసరం,
సాధ్యమైనంత వరకు అక్కడే ఉండటం శ్రేయస్కరం |౫|
ప్రేమికులకు నూతనంగా అనిపించెను తొలిరాత్రి,
పరస్పర ప్రణయ ఆలోచనలతో రసవత్తరమయ్యెను ఒంటరి రాత్రి |౬|
అందంగా కనిపించెను తారలు పూర్ణచంద్రునితో పున్నమిరాత్రి,
గాఢాంధకారంతో మనసులో జడుపు పుట్టించెను అమావాస్య రాత్రి |౭|
ఒకొక్కరికి ఒక లాగ ఉండెను ఏకాకిగా ఉన్న తొలి రాతిరి,
ప్రతి ఒక్కరికి విభిన్న అనుభవాలు ఇచ్చెను ఒంటరి రాతిరి |౮|