ఏదోలా
ఏదోలా
ఊపిరున్నా ప్రాణం పోయినట్లు గా ఉంది.
మనిషి గా ఉన్నా లేనట్లు గా ఉన్నా.
వెలుగున్నా చీకట్లో మగ్గిపోతున్నా.
మాటలు వచ్చిన ముగ వాడిగా మారిపోయాను.
మదిలో అలజడుల పర్వం మొదలైంది.
ఆలోచనలు దేహాన్ని చుట్టేస్తున్నాయి.
అదుపు తప్పిపోయింది ఆ చిన్ని గుండె.
ఆకాశమంతా భారాన్ని మోస్తుంది.
అర్థం కాని ఆవేదన తో యుద్ధం చేస్తున్నా.
ఆయుధం లేని సినికూడిల ఉండిపోతున్నా.
లోలోపల భయపెడుతుంది కొత్తగా.
బీటలు వారుతున్నాయి ఆలోచనలు.
రూపు రేఖలు మారిపోతున్నాయి.
ఆకాశంలో హరివిల్లు రంగులు దాగున్నాయి నాలో.
తెలియడం లేదు ఈ అలజడి ఎక్కడికి వెళ్తుందో
కదల లేక అక్కడే ఆగిపోయాను అక్కడే నాకు నేనుగా.
