STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఎదలోని భావాలు

ఎదలోని భావాలు

1 min
292

గట్టిగా ఆరిచినట్లు అనిపించినా

సినిమాలో ఏడుపు సీన్ చూసినా

కన్నీళ్లు జల జలా రాలిపోతాయి

అది జాలే అంటావా


కొన్నిసార్లు రక్తం చూసినా భయం వేయదు

ఏం చికెన్ షాపులో నువ్వు చూడలేదా


అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అసహ్యం

కానీ కొన్నిసార్లు నేనే అబద్ధాలు చెప్తాను

ఏం నువ్వు చెప్పవా ఏంది


ఇష్టాలు ఎవరికి ఉండవు

అన్నీ బయటికి చెప్తామా ఏంటి

అలా అలా దాచేస్తాం


కొన్ని బాధలు కళ్ళ వెనుక

కొన్ని భావాలు పెదాల వెనుక

నిర్దాక్షిణ్యంగా కుక్కిపెట్టేస్తాం

తప్పంటావా?

తప్పదు అంటాను నేను


సగటు మనిషిని సార్

ఏదీ గట్టిగా అనలేను

కొన్ని వినబడినా పట్టించుకోలేను

ఏమైనా బాధపడకుండా ఉండలేను

మనిషిని కదా..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract