దోసిట మల్లెలు
దోసిట మల్లెలు
నీ దోసిట మల్లెలు
నా కాటుక రేయి వెన్నెలలు
నీ చిలిపి నవ్వులు
నా హృదయ రంగవళ్లులు
నీ కోప తాపాలు
మన్మథుని కొంటె ప్రతాపాలు
అలకల కులుకుల మూతి విరుపులు
వలపు వంటల తాలింపులు
ఇల్లు పీకి పందిరేసే అల్లర్లు
ఫలించిన ప్రేమ గుభాలింపులు
కష్టసుఖాలు, ఒడిదుడుకులు
సంసార సాగర మర్థనాలు
ధర్మపు నాలుగు పాదాలు
వేసిన ఏడడుగులు
అన్యోన్యంగా చేరాలి
ధర్మార్థ కామ మోక్షపు తీరాలు