దీపావళి శుభాకాంక్షలు
దీపావళి శుభాకాంక్షలు


వచ్చింది వచ్చింది జిలుగు వెలుగుల దీపావళి
తెచ్చింది తెచ్చింది కోటి కాంతుల తారావళి
బాణాసంచా వెలుగులు చీకట్లను తరిమి కొట్టేను
ధూమవ్యాప్తితో హానికర క్రిమి కీటకాలు నశించేను
చెడు పై మంచి విజయ విహారమే దీపాల పండుగ
చీకటి పై వెలుగుల వీర విహారమే దీపావళి పండుగ
ఆనందం తో విజయాన్ని బాణాసంచా తో చాటుదాం
చీకటితో పాటు విష కీటకాలను తరిమి తరిమి కొడదాం
దీప కాంతులతో పండుగను ఆనందంగా జరుపుకుందాం
బాణాసంచా వెలుగులో చిన్నారుల సంతోషం చూద్దాం
అందరలో దీపావళి పండుగ సుఖసంతోషాలు విరియాలి
అందరమూ చక్కని అవగాహనతో పండుగ జరుపుకోవాలి.