STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

ధర్మ సూక్తి

ధర్మ సూక్తి

1 min
417

--------------------------

అసత్యము నెప్పుడు పలుకకోయి!

దోసము లెన్నడు చేయకోయి!

మసటుతో మనమును నింపకోయి!

మోసపుటూహలు తల్చకోయి!


సతతము ప్రేమను పంచవోయి!

వ్రతముగ మంచిని పెంచవోయి!

కృతఙ్ఞతతోడ మెల్గవోయి!

వితరణ శీలివై చరించవోయి!


శ్రమయే విజయమని నమ్మవోయి!

శమదమముల సాధించవోయి!

సమయపాలన నెరుగవోయి!

మమతకు నిధివై బ్రతకవోయి!

---------------------------



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational