దేవభూమి
దేవభూమి
ॐॐॐ
🍁🦜🍁
మహతీ సాహితీ కవి సంగమం.. కరీంనగర్..
తేది /25/1/
తేటగీతి కదంబము
భారతీయత యన్నను భాగ్యమిదియె
పెక్కు కులములు జాతులు పేరేమిగొని
దేశ ఔన్నత్య మందున దిశలు జూఁపు
పూజ్య దేవతలెల్లరు మునులు గాగ
మహిత వైభవ మందున మాన్య తొందు
జన్మ భూమికి యిచ్చును సార్ధకతను
భక్తి పెంపొందు మతములు పరగ జొచ్చు
రాజకీయాల ముఖ్యత లాటు లేదు
భరత మాతను గొల్తురు నిరుగు పొరుగు
దేశ ప్రజలునీ యున్నతి స్థిరమిడును
దేశ చరితను జూఁచిన నాశ పెరుగు
శుభము సంపద భక్తికి శోభ గూర్చు
నాది మధ్యాంత రహితుఁడు నాది విష్ణు
లక్ష్మి తోడుత గాచును రహిని యిఁడుచు
కల్ప వృక్షమ్ము సస్యమ్ము గరిమ తోఁడ
భారతావని కానుక పంచె యిటుల
రాశి కన్నాను మెరుగైన వాసి యుండ
విద్యలో పలు ఛాత్రులు పేద వారు
నిత్య శ్రామికులై కఁడు నిష్ఠ బూని
మాతృ భూమికి తెత్తురు మంచి పేరు!!
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
✍️చావలి బాలకృష్ణవేణి
హైదరాబాద్
8341353323
స్వీయరచన.. 🦜