తెలుగోళ్ళమయ్య
తెలుగోళ్ళమయ్య
ॐॐॐ
కం..
తెలుగుకు వెలుగును దేవర
తెలుగును సతతము విదేశ తేజమునౌగాన్
తెలుగును మరువక మఱువపు
తెలుగును మన వారసులకు దెల్పుమ దయతో!1
కం..
తెలుగున తీయని భావము
తెలుగది మాత్రం బునిచ్చు:: తెలియన్ జదువన్
తెలుగును కావ్యము లందున్
తెలుగు జిలుగులే మెరిసెను దేవుని యాజ్ఞన్!! 2
కం..
తెలుగుకు మ్రొక్కెద నెప్పుఁడు
తెలుగదియేజాతిభాష తేటతె ల్లంబున్
తెలుగున సమర్ధత గలదు
తెలుగును నిలుపరె జనులు విదేశము లందున్!! 3
కం..
తెలుగై వచ్చిన జన్మము
తెలుగే తెచ్చినది మాన్యతేకనగా మా
తెలుగే లోకము మెచ్చెను
తెలుగు తనంబునకు లోటు తేవద్దయరో..! 4
కం..
తెలుగున ముచ్చట లాఁడుము
తెలుగున వాక్యమును వ్రాయు తెలివిని గొనుమా
తెలుగున సభ్యత నెక్కువ
తెలుగున కీయంగ కీర్తి తేకువ గల్గున్!!
✍️చావలి బాలకృష్ణవేణి
29, 08, '24
