అష్టప్రాస తో
అష్టప్రాస తో
శ్రీ గురుభ్యోనమః
శ్రీ నివాసాష్టప్రాసతో శార్దూలవిక్రీడితము..
సవ్యంబున్ హరిఁ గొల్వగావలెసదా సవ్యంబుహృద్యంబుగాన్
భవ్యంబైనది నీ దుశక్తి, యిలలో భవ్యంబు సంసేవితా!
శ్రావ్యంబయ్యెడి గానమందుకొనవే, శ్రావ్యంబు నీకీర్తనే!
కావ్యంబున్రచియింప నుంటి సుగుణాల్ కావ్యంబులో వ్రాయుదున్!!
చావలి బాలకృష్ణవేణి
28::09::'24
