STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

దేనికైనా

దేనికైనా

1 min
2


చేయాల్సిందేమి లేదు..జరుగుతోంది చూడటమే..! 

దేనికైన నవ్వుకునే..ముచ్చటలో ఉండటమే..! 


ఉండలేక పోవు మనసు..బాధపడుతు పోయేనోయి.. 

మాయమయే తనువుపట్ల..శ్రద్ధలేక పోవటమే..! 


శాంతికొరకు వెతుకులాట..భలే చిత్రమైన ఆట.. 

ఉన్నదానితో ఉండక..ఆశవెనుక తిరగటమే..! 


ఎవరి చెప్పుచేతలలో..ఎవరుండరు ఏవేళా.. 

ఇదే నేను అనుభావన..పట్టులోన చిక్కటమే..! 


ఆకర్షణ మహిమదెంత..అద్భుతమో చెప్పాలా.. 

లేనిమనసు సృష్టించుకు..విచక్షణను వీడటమే..! 


కోల్పోయే దేమున్నది..దు:ఖానికి చోటెందుకు.. 

నాదేదే తెలియకుండ..కానివన్ని మోయటమే..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance