డిసెంబర్ 25th
డిసెంబర్ 25th
దేవుడు...
ఒక్కడే..అంటారు
గొప్ప గొప్ప...
వేదాంత వేత్తలు..తత్వ వేత్తలు
విద్యా వేత్తలు..
కానీ!
మానవుని చరిత్ర
మొత్తం తరచి చూస్తే...
మానవుని అవసరాలు...
తీర్చేందుకానేక దేవుళ్ళు!
కానీ!
అతని అంతర్ముఖాన్ని ఆవిష్కరించిన
ఆత్మీయుుడువి..నీవే యేసయ్యా!
నిలువెల్లా..
గాయాలైనా..నీ శక్తిని చూపక
సహనానికే సహనం నేర్పావు
సిలువలో...
రక్తాన్ని కార్చి ప్రాణాల్ని అర్పించి
త్యాగానికే త్యాగం చేశావు
కలత హృదయాల..
కష్టాలు కడతేర్చేందుకు
కన్నీటి ప్రార్ధనే మార్గమని
చాటి చెప్పవు!
మత్తులోనున్న మనిషినైనా..
మదమెక్కిన మనిషినైనా..
మాయతో కాదు..
మనసుతో మార్చాలని తెలియజేశావు
మానవుడికి...
మనుషులు స సాక్ష్యం కన్న
మనస్సాక్షి ముఖ్యం అని తెలియజేశావు
పాపం చేసినవాడు..
భయపడి మారడం కన్నా..
బాధపడి మారడం నిజమైన మార్పు
అని తెలియజేశావు!
నీ జీవిత చరిత ద్వారా..
మానవునికి పరిశుద్ధత నేర్పావు
మహాత్ములెందరికో..
నీ జననం ద్వారా
క్రీ పూ... క్రీ శ...అని
మనుగడను తెచ్చిన మహోన్నతడువు
నీవలే..నీ పొరుగు వారిని ప్రేమించు
అని చెప్పిన..
ఓ..పరోపకారి!
మాలో ఉన్న పశులక్షణాల్ని
పటాపంచలు చేసేందుకు..
చూపించు మంచి దారి!
.....రాజ్....
