దారి తెలియని జీవితం
దారి తెలియని జీవితం
జన్మనిచ్చిన తల్లి చేతినొదిలినవాడు పరుగులు తీస్తూ.....
ఆడుకుంటూనే....అమ్మకు తెలియనివ్వకుండా ....
అనుమతి లేకుండా అరుగులు దాటి పరుగులు....
అప్పటి ఆటకు ఆయాసముండదు
ఆనంద సమయాన్ని అనుభవిస్తాం.....
యువత వయసులో యావలనే
దిగ్బందనలోకి దూకుతూ... కోరికలు.....
కలలు కంటూ ఖర్చులంటూ కాసుల
- పంటకు కాలునుండి కపాళం వరకు
ఎదో ఒక అలంకరణ చేస్తూ
పరుగులు తీస్తూ అనుభవిస్తాం.......
యవ్వనమయి యుక్త వయసులో
ముక్త కంఠాలతో ఆశీర్వదించి
అక్షింతలు పడి సంసారమనే
సంతోషంలో స్మరించుకుంటూ
సతీమణి సేవలో....సేవతో
కాలాన్ని అనుబంధంగా మార్చుకుంటూ
ముద్దు ముచ్చట్లు అనుభవిస్తాం.........
ఆరు పదుల వయసును
దాటితే చాలు మారిపోయే
మధురనుభూతులు...!
మందులూ....మూత్ర పరీక్షలకంటూ ముసలి వయసులో
ముక్కల
య్యే మనసుతో
మనోవేదనతో..... మాట చెల్లక
మంచితనాన్ని వెతుకుతూ
మందిలో ముక్కి పోతూ....
మానవ జీవితాన్ని ఒదిలే
వయసులో కళ్ళు ముస్తూ...
ఊపిరినోదిలి జీవితాన్ని
శాస్వతంగా మరచిపోతాం....
అడుగు జీవితాన్ని ప్రారంభం చేసి
ఆరడుగుల జీవితంతో
అంతమయ్యే ఆయాసపు
జీవితానుభవం.......
ప్రయాస పడి పట్టు విడుపులు
పంతాలు.....కక్షలతో .....
తన్నులాడుకున్నా.......
మానవ శరీరానికి
చివరి మజిలీ
మంటల్లో మూగ బోయే ప్రాణాం .......
దీనికోసమే వర్ణించాలన్నా
దొరకని మరో జీవితం.....
ఉన్నంతవరకు ఉత్సాహంతో
ఉన్నా ఊరు చివరకు పోయే
మన జీవితాలు......
మధురమైన జీవితాన్ని
అనుభవంతో.... ఆనందంతో
మజిలీ చేరేవరకు మంచితనంతో
బ్రతికితే మరో జన్మ వరకు
మనల్నే తలంచేలా తరలి వెళదాం
తన్మయాత్వం తో తరుణిద్దాం......