చూపుల మాటలు
చూపుల మాటలు
చూపుకు మాటలు..పొదిగిన వేడుక..!
మౌనపు నదిలా..నవ్విన వేడుక..!
ఊపిరి వేణువు..అందిన దెపుడో..
మనసుకు రెక్కలు..తొడిగిన వేడుక..!
పుట్టిన దెవరో..ఎపుడో ఏమో..
పుడమిని గురువుగ..ఎంచిన వేడుక..!
పోయే దెవరో..మరణం లేదే..
గగనపు వీధుల..తిరిగిన వేడుక..!
విశ్వము లెన్నో..ఒక్క కణములో..
కన్నులు మూసుకు..పట్టిన వేడుక..!
గుణములు రాల్చే..చదువది ఒకటే..
అంతరంగ మున..చేరిన వేడుక..!

