చూడటమే
చూడటమే
.
విషాదాన్ని చిరునవ్వుగ..మలచుకోగ చూడటమే..!
వియోగాన్ని వినోదముగ..తీసుకోగ చూడటమే..!
పీడించే జ్ఞాపకాల..చిత్రాలవి అవసరమా..
జీవితాన్ని నాటకముగ..తెలుసుకోగ చూడటమే..!
ఎఱుకలేని తనమునుండె..పలుప్రశ్నల వర్షములే..
అక్షరాన్ని ఆయుధముగ..నిలుపుకోగ చూడటమే..!
ప్రబోధాల ప్రహసనాలు..పరిహేళన ప్రహేళికలు..
ప్రమాదాన్ని ప్రమోదముగ..మార్చుకోగ చూడటమే..!
కంటిపాప భాషవినే..మనసేగా స్వర్గసీమ..
ప్రకాశాన్ని నిజధనముగ..నింపుకోగ చూడటమే..!

