చూడాలేయ్
చూడాలేయ్
నవ్వులపువ్వులు రాల్చే పాపను చూడాలోయ్
దవ్వుగనున్నా కొండలు కోనలు చూడాలోయ్
ఆకర్షించే పూలసొగసుల్లొ భవిషత్తంతా కనిపిస్తుంది
జీవితమంతా ఆశలురేపే విరికన్నెలనూ చూడాలోయ్
కష్టసుఖాలా కలయికతోనే సప్తవర్ణాల శోభితమైన
సాగేబ్రతుకులొ రంగులుపూసే ఇంద్రధనసునూ చూడాలోయ్
జీవితబాటలొ ఎత్తుపల్లాలు సహజంగానే ఉంటాయికద
సముద్రపుటొడ్జున పడుతూలేచిన తరంగాలనూ చూడాలోయ్
పుట్టినవాడూ గిట్టుటతప్పదు మధ్యలొఎందుకు విబేధాలూ
చరమాంకంలో భూమిలొకలిసిన రాలేఆకులు చూడాలోయ్
