STORYMIRROR

kamala sri

Abstract

4  

kamala sri

Abstract

చనుబాలు

చనుబాలు

1 min
383


***********************************

         చనుబాలు 

***********************************

నవమాసాలు మోసి భయంకరమైన

పురిటి నొప్పులను భరించి

నాకు జన్మ నివ్వడానికి 

నువ్వు మరో జన్మనే ఎత్తావు!!


కోటికాంతులు నిండిన కళ్ళతో 

నన్ను ఎత్తుకుని ముద్దాడి

నీ రక్తాన్నే ధారాలుగా మార్చి

నాకు ముర్రుపాలు అందించావు!!


ఆ పాలే నాకు సంజీవని 

ఆ పాలే ఓ దివ్యౌషధం

నీ నుండే నాకు అన్ని ప్రోటీన్లూ

పోషకాలు అందాయి!! 


ఈనాడు నేనిలా ఆరోగ్యంగా ఉన్నా నంటే 

ఆనాడు నువ్విచ్చిన చనుబాలే కారణం

అవి ఎంతమధురమో తెలుసా అమ్మా

అమృతము కూడా దిగదుడుపే!! 


పాలలో మురిపాలు కలిపి 

నన్ను పెంచి పెద్దచేసిన నీకు

నేనేమిచ్చాను అమ్మా

కడుపునిండా తిండికూడా పెట్టలేదు !!


కడదాకా తోడుగా ఉండి నిన్ను 

కంటికి రెప్పలా చూడాల్సిన నేను

నిన్నో అనాదలా వదిలి 

నా దారిననేను వెళ్లిపోయాను!! 


అమ్మపాలు తాగి 

రొమ్ముపై గుద్దిన చందానా

నా సరదాలను వెతుక్కుంటూ

నిన్నో దిక్కులేని దానిలా వదిలేశాను!!


నేనిలా చేస్తానని నీకు ఆనాడే తెలిస్తే 

నన్ను ఇంతముద్దుగా పెంచేదానివి కాదేమో 

కానీ నీకు తెలీదుగా నేనో స్వార్ధపూరితమైనవాడినని

తెలిస్తే నన్ను వదిలేసేదానివేమో!!


కానీ నువ్వలా చేయవు 

ఎందుకంటే నువ్వు అమ్మవి

కన్నబిడ్డ ఎంతటి కసాయి వాడైనా 

వాడు నీ కడుపుచీల్చుకుని పుట్టినవాడే కదా!!


నా తలరాత ఇలా ఉంది 

అని సరిపెట్టుకుంటావు 

కానీ నన్ను శపించవు 

ఎందుకంటే నువ్వు అమ్మవు!!

                .....కమల’శ్రీ’✍️.



Rate this content
Log in

Similar telugu poem from Abstract