చంద్రలేఖ
చంద్రలేఖ
పాడ రాని రాగమేదొ గొంతు విప్ప చూస్తున్నది..!
భాష రాని భావమేదొ కవిత వ్రాయ చూస్తున్నది..!
ఇంద్రధనువు వర్ణాలకు వర్ణనేమి చేయగలం..!
తెలుపరాని విషయమేదొకలహమాడ చూస్తున్నది..!
జాబిలితో మాటలాడు పాపాయే కంటిపాప..!
పలుక రాని సంగతేదొ పాటపాడ చూస్తున్నది..!
చిత్రమైన కంటిచుక్క స్నేహమెంత చెక్కిలితో..!
చెరుప రాని బొమ్మఏదొ దాచిపెట్ట చూస్తున్నది..!
విరహాలకు ప్రేమలేఖ వ్రాస్తున్నది మేఘమాల..!
చదువ రాని పద్యమేదొ కురిసి మురియ చూస్తున్నది..!

