చిన్నదిరో
చిన్నదిరో
ప్రేమకడలి తీరంలో..వేచియున్న చిన్నదిరో!
తన తియ్యని అడుగులసడి..కోరుకున్న చిన్నదిరో..!
చదువులెన్ని చదివినా..పల్లె మరచి పోని కన్నె..
చిన్నిపడవ లాంటి మనసు..నిలుపుకున్న చిన్నదిరో..!
విదేశాల నుండి బావ..ఎపుడు తిరిగి వస్తాడో..
విరహాన్నే వినోదముగా..మలచుకున్న చిన్నదిరో..!
తన మదిలో సందేశం..నింపె గాలితరగలలో..
అడవిమల్లె తీవమల్లె..నవ్వుతున్న చిన్నదిరో..!
మంచిగంధ మంటి వలపు..తలపులతో పరిమళించె..
అందాలను తనకోసం..దాచుకున్న చిన్నదిరో..

