చిల్లర
చిల్లర
1 min
239
చేతిలో నోటుంది
చెప్పానో మాటుంది
ఇది చిన్న ఇబ్బంది
ఎప్పుడు ఉంటుంది !!
చిల్లరంటే చాలు అల్లరైపోతావు
సరుకు కొంటె గాని చిల్లర డబ్బులు రావు
పెద్ద నోట్లతోటి వచ్చే చచ్చే చావు
చిల్లరుంటే హాయి ఇది తెలుసుకో నీవు !!
చిల్లర లేదని డబ్బు గుంజే ముప్పు
కనిపించని జబ్బు ఇది మన కళ్ళను కప్పు
పెరుగుతున్నది చూడు ఆర్పలేని నిప్పు
తెలిసి తెలియనట్టు ఉంటె వచ్చు నీకే ముప్పు !!
డబ్బుకు డబ్బు
ఇవ్వని జబ్బు
ప్రశ్నర బాబు
లేదు జవాబు !!