చీకటి మనసు
చీకటి మనసు
ఈ చీకటి.....
వెలుగుని రాత్రి పరదాతో కప్పుతుంది
పుడమిని అమాంతంగా కౌగిలించుకుంటుంది
ఈ చీకటి.....
యుద్ధవీరులకు విశ్రాంతిని ప్రసాదీస్తుంది
శ్రమతో అలసిన తనువులకు ఉల్లాసాన్నిస్తుంది
ఈ చీకటి.....
రగులుతున్న ఆలోచనలకు పరిష్కరాం చూపుతుంది
వేదనతో మూలుగుతున్న మనసుకు ఓదార్పునిస్తుంది
ఈ చీకటి.....
దుఃఖం నిండిన గుండెను
ఓదార్చే గుండెకు జతకలుపుతుంది
ఈ చీకటి.....
విరిగిన ఆశలకు ఉపిరిలుదుతుంది
చెదిరిపోయిన కలలను దోసిట్లో పోస్తుంది
ఈ చీకటి.....
కఠిన మనసును సున్నితంగా
మెత్తని హృదయాన్ని కర్కశంగా మారుస్తుంది
ఈ చికటికి
అహం ఎక్కువే ఎందుకంటే
విశ్వ రహస్యాలను చేదిస్తూ
సృష్టి అందాలకు తన కుంచెతో రంగులద్దుతుంది
ఈ చీకటికి
గర్వం ఎక్కువ ఎందుకంటే
ఉదయిస్తున్న సూర్యుడిని చూపిస్థానంటుంది
ఈ కటిక చీకటి....
మనసుకు తీవ్రమైన కోరికలను సప్లయ్ చేస్తూ
తనువుకు విపరీతమైన కాంక్షను డిమాండ్ చేస్తుంది
ఈ చీకటి.....
నిశీధి నిశ్శబ్దంలో కొత్త లోకాన్ని పరిచయం చేస్తుంది
రాత్రి కనులకు కలలను కానుకగా ఇస్తుంది
ఎవరికి తెలుసు ఈ చీకటి....
ఎన్ని మూగ కోరికలకు రెక్కలు తొడుగుతుందో......
ఎన్ని మౌన మనసులకు మాటలు ఇస్తుందో......
ఎవరికి తెలుసు ఈ చీకటి.......
ఎన్ని యవ్వన కలలను నిజం చేస్తుందో....
ఎన్ని దేహాలను వెన్నముద్దల కరిగిస్తుందో....
ఈ చీకటి.....
ప్రేమ మరియు శృంగారంలా అనుసంధాన కర్త
పగలు ఉండే ప్రేమ చంద్రుడు వంటిది
రాత్రయితే ఆ ప్రేమ శృంగారంతో వెన్నెలగా కాయిస్తుంది
ఈ చీకటి.....
మసక అందాలను యవ్వనంగా అవిష్కరిస్తు
ప్రేమికుల ముద్దులతో ఆకాశమంత
పాలపుంతగా ప్రకాశిస్తానంటుంది
ఈ చీకటిలో ......
గడిపే కొన్ని క్షణాలను
జీవితంలో మరువలేని మధురమైన
జ్ఞాపకాలుగా మారుస్తుంది
ఈ చీకటిని.....
అనుభవిస్తున్న కొద్దీ
దాని గొప్పతనం పెరుగుతుంది
గడచిపోయిక దాని ఘడియ విలువను పెంచుతుంది
ఈ చీకటి
చిట్టి పాపలకు ప్ర్రాణం పోసి
చిరునవ్వుల పూయిస్తుంది
పాపాలు చేసి వారి ప్రాణం తీసి
మరణ మృదంగం వాయిస్తుంది
అందుకే ఈ చీకటి....
ముగింపు ఉన్నట్లు అనిపించిన
మొదలుపెట్టిన మొదటి పేజె ఈ చీకటి....

