చిగురాకులలో చిలకమ్మా
చిగురాకులలో చిలకమ్మా


ఏం చెబుదాం అన్నా ఎవ్వరూ లేరు
విందామంటే నాకు ఇష్టం లేదు
చిగురాకులలో చిలకమ్మా
అని పాడుదామంటే
అసలు ఆకులేవీ చెట్లేవీ చిలకలేవీ
అంతా ఎడారి
చుట్టూ ఎడారి
ఈ ఎడారిలో నాకోసం నువ్వు
బదులు పలుకుతావా
నీ ప్రేమతో నందనవనం చేస్తావా