చెలిశ్వాస
చెలిశ్వాస
చెలిశ్వాసల వనసీమన..ఆడుకునే వీలున్నది..!
రగిలిపోవు మనసుగుట్టు..పట్టుకునే వీలున్నది..!
ఆశపడే ముచ్చటలకు..సెలవివ్వగ తెలిసేనా..
అసలు నేను రహస్యమే..అందుకునే వీలున్నది..!
సాయమేమి చేయగలవు..నీకునీవు గాకుండా..
నీ సినిమా బొమ్మలింట..నవ్వుకునే వీలున్నది..!
తప్పులెన్ని జరిగినవో..ఎఱుకలేక జన్మలుగా..
నీ కథనే నీవు సరిగ..దిద్దుకునే వీలున్నది..!
బాధలతో పెనవేసుకు..నేర్చుకున్న జ్ఞానమెంతొ..
బింబాలతొ చెలిమిమీర..పంచుకునే వీలున్నది..!
తడబడు నీ మాటలతో..ఓదార్చుట కుదరదోయి..
ఊరుతున్న గంధాలను..రాల్చుకునే వీలున్నది..!

