బ్రతుకు ఎందుకు
బ్రతుకు ఎందుకు
ఈ జగతిన పయనించగ ఒంటరివా!బెదురెందుకు?
నడిసంద్రపు నావవోలె చిక్కితివా!అదురెందుకు?
నడిరాతిరి వెలుగిచ్చే చందమామ తానొక్కడె
ఈ లోకపు చీకట్లను తొలగించగ భయమెందుకు
చలిగాలుల శిశిరాలే నీఆకులు రాల్చేస్తే
ఎదిరించుచు చిగురించవె నీకింతటి వణుకెందుకు?
ఈ కాలపు దారులలో రేపన్నది చిరుదీపము!
చీకట్లే లేకుంటే లోకానికి వెలుగెందుకు?
నినుమించిన వారంతా బెదిరించగ లేరిక్కడ!
నిదానముగ నడవవోయి! అలుపిచ్చే పరుగెందుకు
వసంతాల పల్లకిలో ఊరేగే రోజున్నది!
నీ ఆశల పల్లవినే పాడలేని స్వరమెందుకు?
క్షణభంగుర మనుకుంటూ తడబడకే చిగురాలా
మదికోరిన శిఖరాలను ఎక్కేద్దాం! బ్రతుకెందుకు!

