బ్రహ్మముడి
బ్రహ్మముడి




అంతా బావుంటుంది
అవును అంతా బావుంటుంది
నీకంటూ ఒక కొత్త కుటుంబం
భర్త ఇంకా అత్త మామలు
ఆపైన పిల్లలు
అంతా బావుంటుంది
ఎన్నో సలహాలు
ఆశీర్వాదాల అక్షతలు
నవ్వులు
ఫోటోలు
అప్పగింతలు
ఆమె తమని విడిచి పోతుంటే
తల్లిదండ్రుల కళ్ళలో తడి
భర్తతో ముడుపడిన బ్రహ్మముడి అటు వైపు లాగుతుంటే
ఆమె కన్నీళ్ళు కాటుకతో కరిగి పెళ్లి పట్టు చీర మీద జారుతుంటే
తన కొత్త జీవితం వైపు సాగిపోయింది