STORYMIRROR

Ramesh Babu Kommineni

Drama Romance

4.8  

Ramesh Babu Kommineni

Drama Romance

బంగారు మావ

బంగారు మావ

1 min
391


సా౹౹

ఉల్లాయిలే ఉల్లాయిలే .......ఉల్లాయిలే

ఉల్లాయిలే ఉల్లాయిలే .......ఉల్లాయిలే


ప౹౹

లంగరు మావా.........బంగారు ..మావా 

సింగారపు మావా.........ఒహో ..మావా ౹2౹


చ౹౹

గంగకాల్వ ఒడ్డునా ఆ ఒడ్డూపొడవుతో 

గట్టున లంగరేసి వస్తాంటే అణుకువుతో ౹2౹

గుబులవుతూ ఉన్నాది గుండెలో అరరే గుబగుబలవుతున్నాది నాకు హరిహరే ౹ప౹


చ౹౹

ఆదివారం సంతలో నేను ఉన్నంతలోన  

ఆదమరచి ఏదో లోకంలో ఉన్నంతలోన ౹2౹

ఆవురావురంటూ చూసావు చూసావుగ

ఆగమాగం నన్నూ ఆగమాగం చేసావుగ ౹ప౹


చ౹౹

సోమవారం సినిమాకని సోకు చేసుకొని

సొగసుగాను వెళితే నే వీలు చూసుకొని ౹2౹

సోగగా నువే న

వ్వితే ఓ చూపు రువ్వితే

సొమ్మ....సొమ్మసిల్లి పోనా అలా నవ్వితే ౹ప౹


చ౹౹

మంగళవారం నేను తీరా తిర్నాళ్ళకెలితే

మంగళగిరి నే మంగళగిరి తిర్నాళ్ళకెలితే ౹2౹

మందాసంతో మర్లిపోతే నువు మర్లిపోతే

మరచి పోలేకపోయానూ అలా తర్లిపోతే ౹ప౹


చ౹౹

బేస్తవారమే కొట్టుకాడికని కొందామనివస్తే

బేరమాడదమని సరకులు బేరమాడ వస్తే ౹2౹

బేల చూపులతోనే నువు చూస్తా ఉంటేను

బేలగా మనసులో కొట్టుకులాడిపోయాను ౹ప౹


చ౹౹

శనివారమని ఆశతోని మొక్కుకుందామని 

శాన పొద్దునే కోవెలకొచ్చా కోరుకుందామని ౹2౹

శబాషని చేతుల్లోకి నన్నేమో చేర్చుకున్నావే 

శకునమైన చూడక నన్నూ కలుపుకున్నావే ౹ప౹



Rate this content
Log in