STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

బంగారు బొమ్మ

బంగారు బొమ్మ

1 min
123


ఓయమ్మో బంగారుబొమ్మ

పడుచుదనపు మిడుసుపాటు వలదమ్మా,.


మబ్బుచీర కట్టిన

అకాశాన్ని మెచ్చేవారున్నా

మెరుపుల తళుకుల

చినుకులకే గంగమ్మ పొంగునమ్మ,

కొంటెతనపు కోరికలు

ప్రణయగీతమే పాడుతున్నా

మనసిచ్చినోడే తీయనిబంధమై మమతలు పంచునమ్మ,

అల్లరికళ్లకు నల్లనికాటుక అందమే అయినా

ప్రేమబాట ముళ్ళులేని పూలబాట కావాలమ్మ.


లోకాన్ని తెలుసుకుంటే

కాకులబెడదా వుండదమ్మా,

వేగిపడక మమతానురాగాల చెలిమితో సప్తపదులు నడువమ్మా,

కలలన్నీ కలబోసిన ప్రియసఖుడితో

ప్రేమగీతాలాలపించవమ్మా,

కలతలెరుగని ఆత్మీయలోగిలిలో నూరేళ్ళు వర్ధిల్లవమ్మా.



Rate this content
Log in

Similar telugu poem from Romance