బంధాలు అనుబంధాలు
బంధాలు అనుబంధాలు


అప్పుడూ ఉన్నాయి బంధాలు అనుబంధాలు,
ఇప్పుడూ ఉన్నాయి బంధాలు అనుబంధాలు,
ఈనాడు వచ్చాయి ఎన్నో ఎన్నెన్నో మార్పులు,
కేవలం మాటమాత్రానికే మిగిలాయి చుట్టరికాలు |౧|
ఆనాడు ఉండేవి ఒకరింటికి ఒకరి రాకపోకలు,
ఈనాడు దూరవాణిలో కూడా లేవు సల్లాపములు,
ఆనాడు కలిసి ఆరగించేవారు పండుగ పిండివంటలు,
ఈనాడు అందరు ఎవరికివారు చేసెను సొంత వేడుకలు |౨|
ఆనాడు ఉండేవారు అత్తలు మావయ్యలు మరదళ్ళు బావలు,
ఈనాడు కొంతమంది వ్యవహరించెను ఆంగ్ల పదాల పిలుపులు,
ఆనాడు ఉండేవి వ్యక్తికి వ్యక్తిత్వానికి బంధుత్వానికి అశేష విలువలు,
ఈనాడు మనిషికి పరిచయం కేవలం ఇచ్చెను వారి ఆస్తులు అంతస్తులు |3|