STORYMIRROR

Dinakar Reddy

Drama Action

4  

Dinakar Reddy

Drama Action

బీచ్ లో ఒక ఉదయం

బీచ్ లో ఒక ఉదయం

1 min
230

ఓ సూర్యోదయాన

గుర్రాల మీద ఎక్కి

వాళ్ళు బీచ్ కి చేరారు


ఒకరు ఇసుకను

మరొకరు నీటిని చూసారు

ఇంకొకరు ఆకాశాన్ని

మరొకరు రాళ్ళను చూసారు


రాళ్ళ మీద పాచి

ఆకాశంలో మేఘం

నీటిలో తేలే పూలు

ఇసుకలో పారాడే ఎండ్రకాయ


పగిలిన రాళ్ళ నుంచి

జారుతున్న నీటి ధార

గుర్రపు స్వారీ ఆపి

వారి పాదాలు సముద్రపు నీటిలో తడిసాయి 


అదే సూర్యోదయం

వేరే వేరే కళ్ళు

వేరే వేరే ఆలోచనలు

కానీ

అందరి మనసుల్లో ప్రశాంతత


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama