భక్తి గీతం కవిత
భక్తి గీతం కవిత
సత్య దేవ మనిషం కౌస్తుభం శ ర ణం కమలేశం
శ్రీనిధి కిరణం వక్షస్థలం అభయం ప్రదాతం శ్రీ రామేశం
చరితం జగద్విదితం నీదు కరుణా సముద్రం
|| సత్య దేవ మనిషం ||
చరణం 1: జీవన గమన సౌలభ్యం - పూజా కీర్తన శ్రవణ ఉత్తీర్ణం
విధివిధాన శ్రద్ధాగమనం - సిరి సౌఖ్య శుభ ప్రదానం
రమా సహిత దిక్పాలన పూజనం - గ్రహారాశి ఆహ్వానం
సర్వవిధ సకల దేవతా స్మరణం - వ్రత కథా శ్రవణం
|| సత్య దేవ మనిషం ||
చరణం 2: సాకార , నిరాకార సత్యపాలనం - అవతార శిష్ట జన రక్షణం
పుణ్య ,తిథి సంకల్పం - పంచామృత శిరా నివేదనం
సకల జన సంక్షేమ యోగం - జీవన్ముక్తి కాసారం
అంత్యే సత్య లోక పయనం - సర్వ జన శ్రేయస్కరం
|| సత్య దేవ మనిషం ||