భారతీయ తత్వంపై అభిమానం
భారతీయ తత్వంపై అభిమానం


భారత దేశం ఎంతో ప్రాచీన నాడు,
ప్రతీ ప్రాంతం అందున ఒక అపూర్వ నాడు |౧|
భారతీయ దేవాలయాలు విశిష్టమైన శిల్పశాస్త్ర నిధులు,
ఆ నాయనానందకరమైన సందర్శనం జ్ఞప్తి చేసెను శిల్పకారుల ప్రయత్నాలు |౨|
ఈ పుణ్యదేశం నుండి వచ్చాయి రామాయణ మహాభారత మహాకావ్యాలు,
ఎప్పుడు చదివినా వినినా చూసినా తెలిసెను నూతన ఉపన్యాసాలు |3|
హిందూదేశ వంటలలో ఉన్నాయి వివిధ రుచులు,
ప్రతీ రాజ్యంలో ఆరగించటానికి ఉన్నాయి ఎనెన్నో అభిరుచులు |౪|
భరతఖండంలో ప్రజలు మాట్లాడేను భిన్న విభిన్న భాషలు,
అందులో మల్లి వ్యవహరించెను ఎన్నో మాండలికాలు ఆరు శాస్త్రీయ భాషలు |౫|
ఆనాడు ఈనాడు ఏనాడైనా భారతీయ తత్వం కలిగించెను అభిమానం,
భారతీయ సంస్కృతి కలకాలం లోకానికి చేసెను శోభాయమానం |౬|