STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Tragedy

4  

Dinakar Reddy

Abstract Drama Tragedy

బెదురు

బెదురు

1 min
326

కళ్ళల్లో అదే బెదురు

నుదిటి మీద నుంచి జారే చెమట

చేతుల్ని పల్చటి దారాలతో కట్టేసినట్టు

గొంతులోంచి మాటల్ని పెగల్నీయకుండా బిగించినట్టు

అతణ్ణి చూస్తే ఏమిటోగా ఉంది


ఇతడిని చూశా తన బుగ్గలు టమాటాలా ఎర్రబడింది

ఇతడి పిలుపు వినడానికా బిందె పట్టుకుని నీళ్ల ట్యాంకర్ ముందు నిలబడింది

ఎగ శ్వాస దిగ శ్వాస అని లేకుండా వెనుకనే పరుగెత్తింది 


ఇతని కోసమా యవ్వనపు అందాల్ని అర్పించాలనుకుంది

రాతిలాంటి కండల చాటున వెన్న లాంటి హృదయం ఉందన్నాడు

ఈవేళ నాతో అవసరం లేదని డొక్కలో తన్ని పోయాడు


మనిషి బ్రతికే ఉందా అని కూడా వెనక్కి తిరిగి చూడలేదు

గుబురు గడ్డంతో ఎవరైనా వీధిలో నడిచెళ్ళినా

ఆ వయసు అబ్బాయిని ఎవరిని చూసినా 

ఇప్పుడూ ఆమెకు అతనే గుర్తొస్తాడు

కానీ డొక్కలో పెట్టిన నొప్పి ఆమెను బెదిరిస్తుంది



Rate this content
Log in

Similar telugu poem from Abstract