STORYMIRROR

Challa Sri Gouri

Classics Inspirational Others

4  

Challa Sri Gouri

Classics Inspirational Others

బాల్య స్మృతులు గొప్ప అనుభూతులు

బాల్య స్మృతులు గొప్ప అనుభూతులు

1 min
405

అహంకారం ఎరుగని మనసులు, 

బడి గంట కొట్టే సమయం కోసం ఎదురుచూపులు, 

అంతటా నిండిన ఆనందపు కోలాహలాలు, 

పంచుకోవడంలో ఉన్న సంతోషాలు, 

కొట్లాటలతో కనబరుచుకునే అభిమానాలు, 

ప్రశంసలకై పోటీలు, 

మెప్పులకై పందేలు, 

అకస్మాత్తుగా వచ్చే అలకలు, 

అంతుచిక్కని ఆవేశాలు, 

స్నేహం కై ప్రయత్నాలు, 

ఆటలకై ఎదురుచూసే కన్నులు, 

అందర్నీ నవ్వించే కోతి చేష్టలు, 

రేపటికై భయం లేని హృదయాలు, 

అనువణువునా ఆనందపు శిఖరాలు, 

అవే కదా బాల్యపు ఆనంద జ్ఞాపకాలు


Rate this content
Log in

Similar telugu poem from Classics