బాలలం..!
బాలలం..!
బాలల దినోత్సవ శుభాకాంక్షలు
బాలలం బాలలం
బాధ అంటే ఏమిటో తెలియకుండా
పెరగాల్సిన బాలలం
కానీ అనుక్షణం
అన్నల అజమాయిషీలు
అక్కల అలుసు తనాలు
అత్తయ్యల అపనిందలు
మామయ్యల మందలింపులు
సీనియర్ల చీవాట్లు
సిటిజన్ల సామెతలు
అమ్మ నాన్న ల పోలికలు
ఆచార్యుల అక్షంతలు
లేచింది మొదలు
వాడిలా చదువు
వీడి లా ఎదుగు
అతనిని చూసి నేర్చుకో రా
ఇతన్ని చూసి మార్చుకోరా
నాకు తెలియక అడుగుతున్న
మరి ఇంతకు నేనెవరిని??
నన్నెవరు చూస్తున్నారు
నాలో ఏముంది నేను ఏమి కోరుకుంటున్నా
అనేది
తల్లిదండ్రులు గా మీకు వద్దు
గురువులకు అసలు వద్దు
అమ్మ నాన్న
అత్త మామ
అక్క అన్న
ఆర్యా..
మీరంతా నా కోసమే చెప్తున్నారు
కానీ..
'నా కోసం' లో నన్నెందుకు మర్చిపోతున్నారు?
బాలల మే.. పిల్లలమే
మమ్మల్ని హాయిగా ఆనందంగా
గడప నివ్వండి
చెప్పండి కానీ చీదరించి కోకండి
చిరునవ్వుతో
సముద్రమంతా సహనంతో చెప్పండి
ఓ పెద్దలారా మరిచారా
మీ చిన్నతనంలో
మీకు మాలాగే అనిపించలేదా?
..... రాజ్....
