బాగుంటుంది
బాగుంటుంది
మద్యం కంటే మధువును పోసే భామే బాగుంటుంది
కలువలు కంటే మధుపము తాగే మధువే బాగుంటుంది
పైపై మెరుగుల నాకర్షించే లోకం చూడాలోయ్
జల్లులు కురిసే మేఘం కంటే మెరుపే బాగుంటుంది
చూసే కనులకు గంతలు కట్టిన, మనసే వక్రం
నవ్వుతొవెలిగే వదనము కంటే నడుమే బాగుంటుంది
పగడపు దీవిలొ ఎగిరే హంసల రూపం అందం ఉన్నా
తెల్లని దేహపు రూపంకంటే నడకే బాగుంటుంది
వెలుగే చూడని కొందరి మనుషుల నైజం అంతేనోయి
ఉదయపు వెలుగుల శోభలకంటే నిదురే బాగుంటుంది

