STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

అవును. నేనో బండరాయిని..

అవును. నేనో బండరాయిని..

1 min
1.1K

థూ

ఏం బతుకు నీది

కరుణ అంటే ఏమిటో నీకేం తెలుసు

దయ లేని మనిషి ఒక మనిషా


ఇలా ఎన్నో విన్నాను

నిజమే

దయ లేని మనిషి మనిషే కాదు

అందుకని నేను శిబిని కాలేను 

అతనిది త్యాగం

నీకు కావాల్సింది ఇతరుల పతనం

నీ మోసాలకిక నేను బలిపశువు కాలేను


అందుకే ఇలా

మనుష్యుల మధ్యలో రాతి మనిషిలా

రాళ్ళ మధ్యలో శిలలా

మిథ్యా ప్రపంచపు శూన్య కేకల్ని పొదివి పట్టుకుని

అనంత సాగర సంగమాల కన్నీటి ఉప్పు నీటినై

ఇలా మిగిలాను


ఒక్క విషయం గుర్తుంచుకో

గుళ్ళల్లో ఉండేది కూడా రాతి బొమ్మే

నీ మనసులో నమ్మకం ఉంటేనే దైవం కనిపించేది

నన్ను దైవాన్ని చేయమని చెప్పను

కానీ విసిరిపడేసే వస్తువులా ఎప్పటికీ చూడకు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract