అసమర్థ మేధావి
అసమర్థ మేధావి
మీ సేవకే జీవితం అంకితం అంటూ
ఓట్లు కొల్లగొట్టి గెలిచిన రాజకీయ నాయకులు
గెలుచుకున్న పదవిని రాచరికం చేస్తూ
తామే రాజులమని భ్రమిస్తూ చేసే తీర్మానాలు
వాడి కంటే వీడు మేలు
వీడి కంటే వాడు మేలు
అని అసలు ఎందుకు ఓటు వేస్తున్నామో
ఎవరికి ఓటు వేస్తున్నామో తెలీని వెర్రి ఆశావాదులు
ఏం చెబుతున్నామో తెలీక
ఎవరి కోసమో పని చేసే మీడియా
అరే!
మాట్లాడితే చెడ్డోడు
మాట్లాడకుంటే చేతకానోడు
నాకు విసుగు పుడుతుంది
ప్రజాస్వామ్యం కూడా రాచరికంలా అగుపిస్తోంది
ఇలాంటివి చెప్పినందుకు
నాకొచ్చిన బిరుదే
అసమర్థ మేధావి
