STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

అనురాగపు కోవెలలో

అనురాగపు కోవెలలో

1 min
1


మనసెపుడో ఇచ్చేశా..చెప్పలేను పెదవివిప్పి..! 

నా మౌనమె ప్రేమలేఖ..చూపలేను ఎదనుపరచి..! 


పరిమళిస్తు రాలిపోగ..సిద్ధపడిన జాణతనే.. 

సమర్పణం ప్రతిగీతం..పాడలేను వరుసకట్టి..! 


మధురప్రణయ భావనయే..ఊయలగా వేసేనా.. 

పదపదమొక ఆలయమే..కట్టలేను గాలినింపి..! 


గుచ్చుమళ్ళు దాచేసుకు..తనవలపుల పాన్పువేయు.. 

వేదనయే ఉత్సవమని..చాటలేను వెనుకనిలిచి..! 


ఊరించే మాయకన్న..నేస్తమెవరు జ్ఞానమొసగ..

ఈ ఊపిరి పొదరింటిని..వీడలేను ఎఱుకనొదిలి..! 


పుణ్యమేదొ పాపమేదొ..వాదనతో పనేముంది.. 

అనురాగపు కోవెలలో..ఉండలేను ఇల్లుమరచి..! 




Rate this content
Log in

Similar telugu poem from Romance