అనురాగ సంగమం : వచన కవితా సౌరభం : కవీశ్వర్
అనురాగ సంగమం : వచన కవితా సౌరభం : కవీశ్వర్
అనురాగ సంగమం
🏆🏆🏆🏆🏆🏆
✒️✒️✒️✒️✒️✒️
" మహిళ లేని మహిలో మగవాడి మనుగడ*
✒️✒️✒️✒️✒️✒️
📢📢📢📢📢📢
" మహిళ లేని మహిలో మగవాడి మనుగడ
📢📢📢📢📢📢
👉🏿అక్షర నమస్సులతో....
అంశం :" మహిళ లేని మహిలో మగవాడి మనుగడ
తేదీ : 28 . 02 . 2022
శీర్షిక : అనురాగ సంగమం
కవిత : వచన కవితా సౌరభం
హామీ : ఈ రచన నా స్వీయ రచన . ఎవరి అనుకరణ కానీ , అనుసరణ కానీ కాదు అని హామీ ఇస్తున్నాను.
అనురాగ సంగమం : వచన కవితా సౌరభం
మహిళ లేని మహిలో మగవాని మనుగడ అసంపూర్ణం
చూపుల కలయిక ఇరువురి తొలిసమ ప్రణయ ఆనంద గీతం
కుటుంబపెద్దల అంగీకార స్వీకారం జంట పరిణయ పరిణామం
అర్థవంతమైన సహకారం జీవన యాత్రకు శ్రీకారం స్వీకారం
కోవెల వంటి గృహ సీమను జీవిత నందన వనం సిరి చందన రవం
చిరు చిరు కలతలు , అలుకలు వారింటిలో విద్యుల్లతా శృంఖలం
వీరు లేనిదే వారు లేరు వారు లేనిదే వీరు లేరు ఆత్మీయ బంధం
నిలుచును పదికాలాలు కొడుకులు కూతుళ్లతో మన్నును వంశవృక్షం
సంస్కృతీ - సంస్కారాలు జనియించును ఈ కుటుంబాలలో నిరంతరం
పండుగలు పబ్బాలు ఆ ఇంటిని చేయును అందరినీ నిక్కముగా కోలాహలం
నిజాయితీ , నమ్మకాలే కుటుంబ సభ్యులకు నిరంతర సర్వం సహయోగం
అందుకే మగువలు-మగవారు ఇద్దరూ సరి సమానం ఈ సృష్టి రచన స్థిరయోగం
వ్యాఖ్య : "ఈ విశ్వ రచనలో వీరిరువురు సహ భాగస్వాములు . ప్రకృతి సంరక్షకులు"
కలం పేరు : కవీశ్వర్
🙏🙏🙏🙏🙏🙏

