అనుకోకోయ్
అనుకోకోయ్
నిన్నెవరో మెచ్చాలని..పొరపాటున అనుకోకోయ్..!
మది మెచ్చే పనినిగాక..మరి ఏదో చేసెయకోయ్..!
నీతులేంటి చెప్పేవట..ఆచరించి మాటాడక..
అద్దెనవ్వు మోసేస్తూ..లోలోపల ఏడ్చెయకోయ్..!
ధైర్యమెవరు ఇచ్చేరట..అనుభవమే గురువవునే..
అడుగేసే బలంకొరకు..బయటెచటో వెతికెయకోయ్..!
ప్రశంసలే ఆశించక..పరిమళించు గుణమేదట..
అమ్మతనం సాక్షియైన..మట్టితనం వదిలెయకోయ్..!
కాలం కనుసన్నలలో..వసంతాలు ముగిసేనా..
వెంటాడే జ్ఞాపకాల..మూటవెంట పరుగిడకోయ్..!
గుక్కతిప్పుకోనివ్వని..శోకజలధి మనసేనోయ్..
అనుబంధపు గంధాలకు..బానిసగా అయిపోకోయ్..!
