అంతర్యుద్దం
అంతర్యుద్దం


నేను
పుట్ట క ముందే
ఎదో పెద్ద కుట్ర జరిగింది !
జాతి అని, మతమని, కులమని, లింగమని
నా మీద ముద్ర వేశారు !
నన్ను నేను చూసే అవకాశం లేదు !
చదువేదో మొదలయ్యా క
ఇప్పుడు 90 శాతం 30 శాతం
ఒకే చోట కూర్చునే అనివార్య స్థితి
అంతర్యుద్దానికి సిద్ధం చేస్తుంది !
జంధ్యం పోగు,మాంసము పేగు
పెన వేసుకొని సాగే పరిస్థితి !
కులాల కొలను లో
కలహాల అలలు !
సామాజిక న్యాయం
జరగని నెత్తు రోడే పచ్చి గాయం !
దేశీయ పక్షులకు ఎన్నో రకాలు గా "రాజ కీయ గాలి" ఎదురు దెబ్బ కొడుతోంది
వలస పోయిన పక్షుల మేధస్సు
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కి మోకరిల్లు తుంది !
జీవితం నుండి పారిపోలేని జీవన విహంగం
పంజరాన్నీ ప్రేమిస్తోంది !
రాళ్ళ కి మొక్కే రీతి
అవినీతి లో భాగం పంచే శీఘ్ర గతి
మొక్కిన వరమీయని వేలుపు
రోజూ లౌడ్ స్పీకర్ నుండి మౌఢ్యానికి మేలు కొలుపు !
జీవితం చుట్టూ వాస్తు,గ్రహాల విష వలయాలు
మ ళ్లి మ ళ్ళి మోసపోయే సుడి గుండాలు
ఆదివారం ఆత్మ గౌరవం వంచన తో
మత మేదో మారి పోతుంది
సిలువ ధరించిన కుహనా గౌరవం
కొత్త " విత్తం "కి విత్తనాలు చల్లు తుంది !
మత కమతంలో
కుల వ్యాకుల వ్యాపారం లో
మానవత్వం చిరునామా లేని ధరిత్రి మిగులుతుంది !
పెట్టు బడి ,లాభం
మా నిఘంటువు లో ఎప్పడు దొర్లే పదాలు
విశ్వ విపణి లో ప్రపంచం చిన్నదైనది
వంచన పెద్ద దైనది
సాంకేతిక మోసం తో సున్నితం గా పీక తెగుతూ ఉంటుంది !
నమ్మకాలు నరకానికి రహ దారులవుతాయి
స్విస్ సర్పం ఎప్పటి లాగే బలిసి బుసలు కొడుతూ ఉంటుంది
క్షణాలన్నీ వస్తు క్షణికాలు గా మారుతుంటాయి
విలువల న్నీ విడిచిన సమాజం
ఒక ప్రాచీన శిధిలాలయ మవుతుంది
హృదయ మున్న వాడు ఉరి లేని పూజారవు తాడు !