అంతరసౌందర్యం...శ్రీనివాస భారతి
అంతరసౌందర్యం...శ్రీనివాస భారతి


ఏమో అనుకున్నా
సముద్రమంత ప్రేమ నామీదేనని
కానీ
లోతుల్లోకి వెళ్లాకే తెల్సింది
అగాధమంత నటన నీదని
మొగ్గ పువ్వుగా విచ్చుకుని
ఆ సుకుమార సౌందర్యం
ప్రతి రెక్కలోనూ ఊహించని ఆహ్వానం
రోజూ నీళ్లు పోస్తూ ముద్దాడుతున్నా
ఒక్కో రెక్కా విడేకొద్ది
కట్టి పడేసే చూపులు
ఇంతందం సృష్టించాడా దేవుడు
అంతా నాకే సొంతం చేస్తూ
ఆకాశంలో చందమామ బల్బు
వసరా వైపే నిలిచిన చూపు
మొక్కకు ఆత్రుత లేదేమో మరి
నా కళ్లు మాత్రం రోజా వైపే
-------------***********---------------